TEJA NEWS

సోదరుడిని చంపి డెడ్ బాడీని బైక్ పైన తీసుకొని వెళ్లిన దారుణ సంఘటన..?

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, శేషిరెడ్డి, చిన్ననాగిరెడ్డి అన్నదమ్ములు ఉన్నారు. వీరిమధ్య ఏడాదినుంచి ఆస్తితగాదాలున్నాయి. అయితే నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి కలిసి శేషిరెడ్డిని చంపారు.
చంపేసి ఎవరికీ అనుమానం రాకుండా బైక్ పై మధ్యలో కూర్చోబెట్టుకుని మొహంపై ముసుగు కప్పి, ఏపీలోని కర్నూల్ జిల్లా కొత్తకోట శివారులో మృతదే హాన్ని పడేసేందుకు బైక్ పై తీసుకెళ్లారు. బైక్ పై మధ్యలో ముసుగు కప్పి మృత దేహాన్ని తీసుకెళ్లడంతో, అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీశారు.
దీంతో భయపడ్డ వాళ్ళు శవాన్ని అక్కడే వదిలేసి పోలీసులకు లొంగిపోయారు.


TEJA NEWS