TEJA NEWS

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కు వెనుక బడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము భారత దేశ అత్యున్నతమైన అవార్డు భారత రత్న అవార్డును ప్రకటించింది.

జననాయక్ గా పిలిపించుకునే జనతా పార్టీ తరుపున బీహార్ ముఖ్యమంత్రి గా 1970 డిసెంబర్ నుంచి 6 నెలలు, 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు పనిచేశారు.

కర్పూరీ ఠాకూర్ 1924లో బీహార్ లోని సమస్తిపూర్ లో జన్మించిన ఈయన ఉపాధ్యాయుడిగా భారత దేశ స్వతంత్ర సమరయోధుడిగా, రాజకీయ వేత్తగా సేవలందించారు. ఈయన 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 26 నెలల జైలు జీవితాన్ని కూడా గడిపారు.1952లో మొదటి సారిగా బీహార్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1967 లో బీహార్ ఉప ముఖ్యమంత్రి గా పనిచేశారు. ఆ తర్వాత సీఎం అయ్యాక బీహార్ లో తొలిసారిగా లాభాపేక్ష లేని భూములపై రెవెన్యూ పన్నును రద్దు చేశారు.


TEJA NEWS