TEJA NEWS

మహిళా జర్నలిస్టు మెండెం రమణ మృతి బాధాకరం
చిన్న మీడియా జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలి*
నివాళులర్పించి మాట్లాడిన టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి*

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్:

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుగా కొనసాగుతూ హఠాన్మరణం చెందిన మహిళా జర్నలిస్టు మెండెం రమణ మృతి బాధాకరమని చిన్న మీడియాలో కొనసాగుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మహిళా జర్నలిస్టు మెండెం రమణ,మరణ వార్త విని అసోసియేషన్ నాయకులతో కలిసి వెళ్లి ఆమె మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు మీడియా రూపకంగా ఉచిత సేవ చేస్తున్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టులను అన్ని రకాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.పేదరాలైన రమణ కుటుంబాన్ని ప్రభుత్వ పెద్దలు అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థల వారు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తోటి సహచర జర్నలిస్టులు అందరూ ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు.ఆమెకు నివాళులర్పించిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి నాగబాబు,హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు అల్వాల రవికుమార్,గౌరవ అధ్యక్షుడు చిలక సైదులు,గౌరవ సలహాదారులు బరిగల వీరయ్య, గొబ్బి రాము,సీనియర్ జర్నలిస్టు ఒగ్గు ఇస్సాకు,ప్రసాద్ మహేష్, సూర్యాపేట పట్టణ కోశాధికారి తిరుపతి శ్రీనివాస్ ఇతర జర్నలిస్టు మిత్రులు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS