TEJA NEWS

సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రక నిర్ణయం

తూంకుంట మున్సిపల్ లో లబ్ధి దారుడి ఇంట్లో భోజనం చేసిన మేడ్చల్ కలెక్టర్, తోటకూర వజ్రెష్ యాదవ్

రేషన్ కార్డు లబ్ధి దారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన చారిత్రక నిర్ణయమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం తూంకుంట మున్సిపల్ లోని బాబా గూడా లో లబ్ధి దారుడి ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనం కార్యక్రమంలో,టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు,మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ గారు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయండర్ రెడ్డి ,పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో,శామీర్ పేట్ మండల్ ఎం ఆర్ ఓ యాదగిరి రెడ్డి, తూంకుంత మున్సిపాలిటీ కమిషనర్ వెంకట వేణుగోపాల్,మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) మెంబర్, భీమిడి జైపాల్ రెడ్డి ,మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి,శామీర్పేట్ మండల్ అధ్యక్షులు వైస్ గౌడ్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్,మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు,