టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమం

టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమం

TEJA NEWS

టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమం
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వట్టే జానయ్య యాదవ్


సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న యాదవుల కులదైవం టేకుమట్ల చౌడమ్మతల్లి జాతర సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో ఈ నెల 19 న ప్రారంభం కానుంది. కాగా ముందుగా దృష్టి పూజా కార్యక్రమాన్ని యాదవ కుల పెద్దలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టే జానయ్యయాదవ్ హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌడమ్మతల్లి జాతరను చుట్టూ పది ఊర్ల ప్రజలు వచ్చి నిర్వహిస్తారని ప్రతి రెండేండ్లకు ఒకసారి మూడు రోజుల పాటు నిర్వహించుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. తల్లి దీవెనలతో యాదవులు అభివృద్ధిచెందాలని జాతరను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని కోరారు. ఘనంగా నిర్వహించే ఈ జాతరను యాదవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ జాతరకు టేకుమట్ల,అనాజిపురం,పిల్లలమర్రి,ఉప్పలపహాడ్,బాలెంల, రాయినిగూడెం.తదితర గ్రామాల యాదవ కులస్థులందరూ పాల్గొని తల్లి దీవెనలు అందుకోవాలని తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS