దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎగ్జిట్ పోల్ పై
మే, 11 సాయంత్రం 6-00 గంటల నుండి ఒపినియన్ పోల్ పై నిషేధం – జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్
…..
వనపర్తి : దేశంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు కొన్నిచోట్ల అసెంబ్లీ బై పోల్ పూర్తి అయ్యే వరకు మీడియా ద్వారా వెలువరించే ఎగ్జీట్ పోల్ ను నిషేధిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారి చేసినట్లు వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందాలాల్ పవార్ నేడోక ప్రకటనలో తెలిపారు.
4వ విడతలో తెలంగాణ రాష్ట్రంలో మే, 13 న 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ నిర్వహించడం జరుగుతుంది. మిగిలిన మరో మూడు విడతల ఎన్నికలు జూన్ 1 సాయంత్రం 6.00 గంటలకు ముగుస్తుందని అందువల్ల జూన్1 సాయంత్రం 6.30 గంటల వరకు అన్ని మీడియా వ్యవస్థలు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా వెలువరించే ఎగ్జిట్ పోల్ ను నిషేదించినట్లు తెలిపారు.
48 గంటల నుండి అనగా మే, 11 సాయంత్రం 6 గంటల నుండి ఆర్.పి యాక్ట్ 1951 ప్రకారం ఒపినియన్ పోల్ పై కూడా నిషేధం ఉంటుందని తెలిపారు.