ఎయిర్ పోర్ట్‎లో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులు.. దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..

ఎయిర్ పోర్ట్‎లో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులు.. దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..

TEJA NEWS

దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసులు. వారిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐసిస్ ఉగ్రవాదులుగా గుర్తించిన ఈ ప్రత్యేక పోలీసుల బృందం ముందు వారిని అరెస్టు చేసింది.

వీరంతా శ్రీలంకకు చెందిన వారిగా తెలిపింది. వీరిని ఇంటెన్సివ్ క్వెశ్చనింగ్ కోసం గుజరాత్ ఏటీఎస్ అధికారులు ప్రత్యేకమైన ప్రాంతానికి తీసుకెళ్లారు.

అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్న వీరి కదిలికలపట్ల అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఉగ్రవాదులు శ్రీలంక నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్ చేరుకున్నట్లు ప్రధామికంగా నిర్థారించారు ఎయిర్ పోర్టు అధారిటీ అధికారులు. కొందరి నివేదికల ప్రకారం ఈ పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదులు పాకిస్థాన్ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉగ్రవాదుల కదలికలతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. క్వాలిఫయర్ మ్యాచ్ కోసం మూడు ఐపిఎల్ క్రికెట్ టీంలు అహ్మదాబాద్ విమానాశ్రయానికి రాకముందే ఈ అరెస్టులు జరగడంతో క్రికెట్ అభిమానులతో పాటు చాలా మందిలో ఆందోళన నెలకొంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS