TEJA NEWS

ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రశ్నోత్తరాలలో భాగంగా “విద్యార్థులకు విదేశీ విద్య ఉపకార వేతనాలపై” అంశంపై ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు .

ఈ ప్రశ్నోత్తరాలలో భాగంగా కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….

ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ, అగ్రవర్ణాల కులాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులు తమ ఉన్నత విద్యకై, ఉజ్వల భవిష్యత్తుకై గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20 లక్షల రూపాయలను విద్యార్థులకు అందజేస్తూ విదేశీ విద్యను ప్రోత్సహిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ విద్యను నిర్వీర్యం చేస్తూ పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయక విద్యార్థులను – విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తోంది.

మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రభుత్వం విదేశీ విద్యపై 100 కోట్లు వెచ్చించేందుకు ఎందుకు వెనకాడుతున్నారో ప్రభుత్వం తెలియజేయాలి.

విదేశీ విద్యపై బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి పొంతనలేని సమాధానాలు లభిస్తున్నాయి. ఇక్కడ అంకెల గారడే తప్పా విదేశీ విద్య ఆచరణలో ప్రభుత్వానికి నిబద్ధతలేదనేది స్పష్టమవుతోంది.

విదేశీ విద్య ఉపకార వేతనాలపై ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా…? అని ప్రశ్నిస్తే ఏమీ లేవు అంటూనే మరో పక్క 104 కోట్ల బకాయిలను చూపించడం, అసలు ఎన్ని దఫాలు చెల్లించారు, ఇంకా ఎన్ని దఫాలు పెండింగ్లో ఉన్నాయంటే సరైన సమాధానం లేదు.

మంత్రిగారు దేశీ విద్య ఉపకార వేతనాలపై ఒకటి మరియు రెండవ ఇన్స్టాల్మెంట్లు పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారు, గత ప్రభుత్వ హయాంలోనే 2023 డిసెంబర్ వరకు 7801 మంది విద్యార్థుల కోసం దాదాపు 1131.56 కోట్ల రూపాయలు చెల్లించి మొదటి దఫా ఇన్స్టాల్మెంటును పూర్తిగా చెల్లించడం జరిగింది.

ప్రభుత్వ మాత్రం రెండు, మూడో దఫా ఇన్స్టాల్మెంట్లలో బకాయిలను చెల్లించాల్సి ఉండగా గత పది సంవత్సరాల విదేశీ విద్య ఉపకార వేతనాల చెల్లింపు పై చర్చిస్తూ సభను, ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది.

మేము గత ప్రభుత్వ హయాంలో 20 లక్షల రూపాయలు విదేశీ విద్య ఉపకార వేతనాలకు చెల్లిస్తే…. కాంగ్రెస్ పార్టీ 25 లక్షల రూపాయలు ఇస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి, సంవత్సరం గడుస్తున్న పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడం విచారకరం.

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు తయారయింది విదేశీ విద్య ఉపకార వేతనాల విద్యార్థుల తీరు.

ప్రభుత్వాన్ని నమ్ముకొని విదేశీ విద్య ఉపకార వేతనాలపై విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అక్కడ ఇరుక్కుపోయి, ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం పదేపదే చెబుతున్న విదేశీ విద్య ఉపకార వేతనాల భవిష్యత్తు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేడు ప్రశ్నార్ధకంగా మారింది.

ప్రభుత్వంలో నేడు 10% కమీషన్లు ఇస్తేనే బిల్లులు చెల్లించే పరిస్థితి తయారయింది. ఇకనైనా ప్రభుత్వం 10% కమీషన్లు బంద్ చేసి విదేశీ విద్య ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.


TEJA NEWS