
స్కూళ్లకు వేసవి సెలవులు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!!
తెలంగాణ విద్యాశాఖ(Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న వేళ ఈనెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైయివేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది.
వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్ను ఖరారు చేసినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక్కపూట బడులు (Half Day Schools) కొనసాగుతున్నాయి. వేసవి సెలవుల్లో భాగంగా మొత్తం ఈసారి 45 రోజులకు పైగా పాఠశాలలు మూత పడనున్నట్లు తెలుస్తోంది.
