The government has launched a new plan so that every body is like a mother's lap
హైదరాబాద్:
రాష్ట్రంలోని ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడిలా ఉండేలా…ప్రభుత్వ పాఠశాలల ఆలనా పాలన కోసం సర్కారు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బాగోగులను పట్టించుకునే బాధ్యతను అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.సీఎం ఆదేశాల ప్రకారం… ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. కమిటీల్లో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్య క్షులు, పాఠశాల ప్రధానో పాధ్యాయులు, ప్రతీ తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లులు సభ్యులుగా ఉంటారు.ఇకపై పాఠశాలల్లో జరిగే ప్రతీ పనిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తీర్మానం తోనే చేపట్టనున్నారు. సంబంధిత కార్యాచరణను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.పాఠశాలల్లో అవసరమయ్యే తక్షణ పనులను గుర్తించి జూన్ 10 లోగా పూర్తి చేయాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రూ.25 వేలలోపు ఖర్చయ్యే పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే చేపడతాయి.
అంతకు మించి, రూ.లక్ష వరకు ఖర్చయ్యే పనులకు ఎంపీడీవో, రూ. లక్ష దాటిన పనులకు జిల్లా కలెక్టర్ల అనుమతిలో చేపట్టాల్సి ఉంటుంది. పాఠశాలల్లో కిటికీలు, తలుపులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతులను ఆయా కమిటీలు చేపట్టను న్నాయి.ఇందుకవసరమైన దాదాపు రూ.600 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. సంఘాల మహిళలపై భారం పడకుండా ఆదర్శ కమిటీలు చేపట్టే పనులకు రూ.25 వేలు అడ్వాన్సుగా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.వీటితోపాటు పాఠశాల విద్యార్థులకు అవసరమైన యూనిఫారాలను కుట్టే పనులను కూడా సర్కారు స్వయం సహాయక సంఘా లకే అప్పగించింది. దీంతో వాటిల్లోని మహిళలకు స్థానికంగా ఉపాధి దొరు కతుందనీ, అంత మేరకు ఆదాయం సమకూరు తుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈసారి బడిబాట కార్యక్ర మాన్ని కూడా తల్లుల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందనీ, తల్లుల పర్యవేక్షణ పెంచటం ద్వారా బడిలో చేరే ఆడ పిల్లల సంఖ్య కూడా పెరుగు తుందని భావిస్తోంది. తద్వారా ప్రయివేటు బడు లపై మోజును తగ్గించట మేగాక నాణ్యమైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించటంలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తోంది…