TS SSC Exams 2024: తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ టీఎస్ పదవ తరగతి హాల్ టిక్కెట్లను 2024 విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు నేరుగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వెబ్‌సైట్ bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈనెల అంటే మార్చి 18 నుంచి మార్చి 30 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు.
అయితే, రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. పరీక్షల్లో కాపీ నివారించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నపత్రం తీసుకున్న వెంటనే తమ హాల్ టిక్కెట్ నంబర్ ముందుగా రాయాలి. దీంతో ఆ పత్రాలు కూడా తారుమారు కాకుండా ఉంటాయి. ముఖ్యంగా కాపీ పాల్పడిన విద్యార్థులను డిబార్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది..
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి రాయనున్న విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా పరీక్షకు నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. కానీ, ఈసారి మాత్రం ఐదు నిమిషాలు ఆలస్యం అయినా విద్యార్థులను పరీక్షకు అనుమతించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. అయితే, ఇటీవలి కొన్ని ఉదాంతాల నేపథ్యంలో ఇంటర్మీడియేట్‌కు కూడా ఈ ఐదు నిమిషాల నిబంధనను అమలు చేసింది.
హాల్ టిక్కెట్ డౌన్ లోడ్ చేసుకునే విధానం..
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు TS SSC హాల్ టిక్కెట్లను bse.telangana.gov.in ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అక్కడ హాల్ టిక్కెట్ 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. విద్యార్థులు తమకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. చివరగా సబ్మిట్ కొట్టాలి. అప్పుడు హాల్ టిక్కెట్ కనిపిస్తుంది.
ఇప్పుడు హాల్ టిక్కెట్లోని వివరాలను క్షుణ్నంగా పరిశీలించి డౌన్‌లోడ్ చేసుకోవాలి. రెండు మూడు హార్డ్ కాపీలను డౌన్ లోడ్ చేసి పెట్టుకోండి.