మద్యం మీద ఉన్న ప్రేమ విద్య మీద లేదా ముఖ్యమంత్రి

మద్యం మీద ఉన్న ప్రేమ విద్య మీద లేదా ముఖ్యమంత్రి

TEJA NEWS

The love of alcohol is over education or the chief minister

మద్యం మీద ఉన్న ప్రేమ విద్య మీద లేదా ముఖ్యమంత్రి కి…………..
కిషోర్ రెడ్డి. విద్యార్ధి నాయకుడు న్యాయవాది.
………………………………………………….
*సాక్షిత వనప ర్తి : మద్యం మీద ఉన్న ప్రేమ విద్య మీద లేదు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అని విద్యార్థి నాయకుడు, న్యాయవాది, జనుపల కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మద్యపాన శాఖకు మంత్రిని నియమించిన ముఖ్యమంత్రి కి పెద విద్యార్థులు చదువుకునే విద్యాశాఖ మంత్రి ని నియమించకపోవడం చాలా బాధాకరం మీకు కావలసింది డబ్బుల మీద మాత్రమే ప్రేమ ఉంది కానీ పెద ప్రజల మీద లేదు అని విమర్శించారు విద్యా శాఖ అధికారులు నిన్న హుటాహుటిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేసి పుస్తకాల ముందు మాట పేజీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫోటో ఉంది అని చెప్పి నాలుక కరుచుకుని పంపిణీ చేసిన పుస్తకాలు వెనక్కి తీసుకొని పాఠ్యపుస్తకాలు మార్చి పంపిస్తాం అని కొన్ని వేల పుస్తకాలు రిటర్న్ చేయడం జరిగింది దీని వలన ప్రభుత్వ అదాయానికి ఎంత నష్టం జరుగుతుంది దానికి ఎవరు బాధ్యత వహిస్తారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడానికి ఎంత ఆలస్యం అవుతుంది. మీ తప్పిదాల కారణంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం పర్యవేక్షణ కరువై విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది కావున ముఖ్యమంత్రి ఇప్పటికైనా విద్యా శాఖ మంత్రి నీ నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని యెడల విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఉద్యమాలు చేస్తాం అని హేచ్చరించారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS