TEJA NEWS

భక్తులకు పూర్తిస్ధాయి సదుపాయాలు కల్పించండి

విశాఖ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర

పెందుర్తి,ఫిబ్రవరి8

: సింహచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో ఇటీవల కాలంలో నిర్వహిస్తున్న పలు ఉత్సవాల నిర్వహణ ప్రశంసనీయమని విశాఖ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతీ మహా స్వాములు కొనియాడారు. ఈ మేరకు సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయ సలహా మండలి సభ్యలు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు గురువారం శారదాపీఠాధిపతులను కలుసుకుని సింహద్రినాధుడు జ్ఞాపికను అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింహచలం దేవస్ధానంలో తాజాగా నిర్వహిస్తున్న పలు ఆర్జిత సేవలు, అభివృద్ధి పనులు వివరాలను స్వామీజీలకు శ్రీనుబాబు విపులముగా తెలియజేశారు.వైకుంఠ ఏకాదశి, పుణ్యనదీ హరితి, గజేంద్ర మోక్షంతో పాటు అనేక ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించారని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు. ఉత్సవాల నిర్వహణలో ఈవోఎస్‌. శ్రీనివాసమూర్తి అందించిన సేవలు కూడా అభినందనీయమని స్వామీజీ ప్రశంసించారు. ఈవో ఉత్సవాలు చక్కగా నిర్వహించారన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవెల్పుగా విరాజిల్లుతున్న సింహద్రినాధుడిని దర్శించేందుకు ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో భక్తులు తాకిడి పెరిగిందని వారికి పూర్తిస్ధాయి సదుపాయాలు కల్పించే దిశగా అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు కృషి చేయాలని స్వామి సూచించారు. ఈ సందర్భంగా పీఠం ప్రాంగణంలో గల శారదా స్వరూప రాజశ్యామలతో పాటు పలు దేవతామూర్తులను శ్రీనుబాబు దర్శించుకున్నారు.


TEJA NEWS