ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కాలనీ సభ్యులు, సంఘ సభ్యులు కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు పరిష్కరించాలని మరియు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అదే విధంగా పలు ప్రాంతాలలో జరగనున్న వివిధ శుభకార్యాలకు, సేమి క్రిస్మస్ వేడుకులకు హాజరుకావాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు…