తల్లి ఇద్దరు పిల్లలు తో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య
వనపర్తి : తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కు చెందిన నిరంజన్ నసీఫా బేగం(35) వీరిద్దరు భార్యాభర్తలు వీరికి ఇద్దరు పిల్లలు ఒక హబీబ్ (7) సనా బేగం (5) పిల్లలుఉన్నారు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం ఈ నేపథ్యంలో సోమవారంకూడా భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో విసుగు చెందిన నసీఫా బేగం తన ఇద్దరు పిల్లల తో కలిసి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తాళచెరువులో సోమవారం రాత్రి దూకి ఆత్మహత్య చేసుకున్నారు నసీఫా బంధువులు వెతకగా మంగళవారం ఉదయం తాళ్లచెరువులో మృతదేహాలుగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారని పోలీసుల అక్కడికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఫిర్యాదు అందిన వెంబడి దర్యాప్తు చేపడతామని
ఎస్సై తెలిపారు