TEJA NEWS

హైదరాబాద్ సచివాలయంలోని మంత్రి సీతక్క కార్యాలయంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి “సీతక్క” అధ్యక్షతన నిర్వహించిన “వాల్టా రాష్ట్రస్థాయి అథారిటీ సమావేశం” లో పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

తెలంగాణ వాటర్ లాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, 2002 కు అనుగూణంగా జిల్లా స్థాయి అథారిటీల ఏర్పాటు, పర్యావరణము సహజ వనరుల పరిరక్షణ కోసం ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ, టీజీ వోల్టా ఫండ్ ఏర్పాటు, అధిక నీటి వినియోగ గ్రామాల నోటిఫికేషన్ తదితర అజెండా అంశాల పై చర్చలు జరిపారు.

ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, పర్యావరణ కార్యకర్తలు పాల్గొన్నారు.