TEJA NEWS

*భగవంతుని దివ్య ఆశీస్సులతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి: చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” *

చేవెళ్ల నియోజకవర్గం : చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు *కాలే యాదయ్య తన జన్మదినం సందర్భంగా… చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ సమీపంలో గల దుర్గమాత అమ్మవారిని, హిమాయత్ నగర్ సమీపంలో గల చిలుకూరు బాలాజీని, మరియు షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన కార్యమంలో పాల్గొని, స్వామి వార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ఆశీర్వాచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.