స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను పరిశీలించిన పోలీస్ కమిషనర్

TEJA NEWS

ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం యంత్రాలను భద్రపరచిన
స్ట్రాంగ్ రూమ్స్ నలువైపులా కేంద్ర పోలీస్ బలగాలు, జిల్లా ఆర్మ్ డ్ పోలీస్, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రతతో పాటు నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్టమైన రక్షణ వుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు కూడా తావు లేకుండా పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ… సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సిఐ రాజిరెడ్డి పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page