TEJA NEWS

గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ నిధులను ఉపయోగించకుండా భ్రష్టు పట్టించింది – ప్రత్తిపాటి.

నీటి సంఘాల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి – ప్రత్తిపాటి పుల్లారావు.

గడిచిన 5 సంవత్సరాలలో జల జీవన్ మిషన్ నిధులను ఉపయోగించకుండా ఉండటం వల్ల, గ్రామాలలో నీటి సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ మంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలో వారి నివాసంలో మంగళవారం ఉదయం ఆర్డబ్ల్యూఎస్ మరియు ఎన్ ఎస్ పి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో డిసెంబర్ 5 నా జరిగే నీటి సంఘాల ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ,చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలో పసుమర్రు గ్రామంలో చెరువుకు 6 కోట్ల నిధులతో పనులు పూర్తి అయినప్పటికీ,గ్రామంలో నీటి సరఫరా జరగడం లేదు. నీటి సరఫరా సమస్యలు నిరంతరం ఎందుకు వస్తున్నాయని, వెంటనే చెరువుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయల నిధులతో 64 పనులకు సంబంధించి,జల జీవన్ మిషన్ గ్రాంట్ కింద విడుదల అయిన పనుల పురోగతి వివరాలను ప్రత్తిపాటి పుల్లారావు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకూ 18 పనులు పూర్తి కాగా, 5 పనులు జరుగుతున్నాయని,41 పనులు ఇప్పటివరకూ మొదలు కాలేదని ఈ ఈ తెలయజేయడం జరిగింది.ఇక మీదట ప్రణాళికా బద్ధంగా పనులన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పనులు పూర్తి చేయాలని అధికారులను ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించడం జరిగింది.


TEJA NEWS