ఖమ్మం జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్, సెక్రటరీ కు వినతి
ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలను పరిష్కరించి వారికి తగిన విధంగా న్యాయం చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంభంపాటి నారాయణరావు కు మరియు సెక్రటరీ జగదీశ్ కి ఖమ్మం జిల్లా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిస్టిక్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు గుండెపోగు నరేష్ మాట్లాడుతూ… చాలీ చాలని వేతనంతో జిల్లాలో ఎంతో మంది ల్యాబ్ టెక్నీషియన్ లు గా పనిచేస్తున్నారని పెరిగిన నిత్యవసరాల ధరలకు అనుగుణంగా వారి వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనాలతో ల్యాబ్ టెక్నీషియన్లు తమ కుటుంబ పోషణ కు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నమ్ముకున్న వృత్తి పట్ల నిబద్ధతతో పని చేసినా ఆర్ధికంగా కుంగి పోతున్నామని తెలిపారు. తక్కువ వేతనంతో ఎక్కువ పని గంటలు పని చేయడం జరుగుతుందని అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు స్పందించి సంవత్సరానికి ఒకసారి వేతనం 10% ఇంక్రిమెంట్ అయ్యేవిధంగా అంతేకాకుండా 12 గంటలు గా ఉన్న పనివేళలను 8 గంటలకు కుదించి ల్యాబ్ టెక్నిషన్లకు తగు న్యాయం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏం. వినయ్ కుమార్, ట్రెజరర్ వంకాయల నవీన్ తదితరులు పాల్గొన్నారు.