దోపిడీ ప్రభుత్వాలను ఓడించడానికి కార్మిక వర్క నాయకత్వంలో అశేష ప్రజానీకం పోరాడాలి

దోపిడీ ప్రభుత్వాలను ఓడించడానికి కార్మిక వర్క నాయకత్వంలో అశేష ప్రజానీకం పోరాడాలి

TEJA NEWS

ఎం కృష్ణారెడ్డిపిలుపు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

…..

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

సామ్రాజ్యవాదం, బడా బుర్జువా వర్గం దోపిడీని కార్మిక వర్గ నాయకత్వంలో కూ ల త్రోసి రైతాంగం భాగస్వామ్యంతో భారతదేశంలో విప్లవాన్ని విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైరాలో మిట్టపల్లి ఫంక్షన్ హాల్ లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా రాజకీయ తరగతులలో “భారతదేశ చరిత్రను” ఆయన బోధించారు.పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ,ప్రపంచంలో భారతదేశం మూడు లక్షల ట్రిలియన్స్ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉన్నప్పటికీ, ప్రపంచ సంపదలో ఐదో స్థానంలో ఉన్నదని, సంవత్సరానికి ప్రతి కుటుంబ సభ్యుడికి సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలను సంపదలో వాటాగా ఇవ్వవచ్చు అని, కానీ,ప్రతి వ్యక్తికి నెలకు 25 వేల రూపాయలు వేతనం డిమాండ్ చేస్తున్న, నెలకు ఎనిమిది వేల రూపాయల కూడా సగ టున ప్రభుత్వాలు ఇవ్వలేకపోవటం దౌర్భాగ్యకర పరిస్థితి నరేంద్ర మోడీ మతతత్వ పాలనలో పరిస్థితి నెలకొని ఉన్నదనిఆయన విమర్శించారు. 56 ఇంచుల ఛాతిగలిగిన, ద్వారా దృష్టి పరిపాల దక్షుడిగా ప్రచారం చేసుకుంటున్న మోడీ, రోజుకు1600 కోట్లు ఆదాయం వస్తున్న బడా కార్పొరేటు పెట్టుబడి దారి వర్గాలు ఉన్నారని, బిజెపి ఆర్ఎస్ఎస్ ఏలుబడిలో వీరు రోజురోజుకు కోటీ శ్వరులు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క ప్రభుత్వ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదని,నరేంద్ర మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాదం, బడా బూర్జువ వర్గంతో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ అనేక రాయితీలు కల్పించి, వారిని బాగు చేయడమే తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేకిన్ ఇండియా అందమైన నినాదం ఇవ్వటమే తప్ప స్వదేశీ వస్తువులు ఇండియాలో తయారు కావటం లేదని అన్ని ఇతర సామ్రాజ్యవాద దేశాలలో తయారుచేసి వస్తువులను మన దేశంలో దిగుమతి చేసుకోవడం ఘోరమని ఆయన అన్నారు . స్టార్ట్ అప్ ఇండియా, అచ్చేదిన్, స్వదేశీ , షైనింగ్ ఇండియా, భారత్ వెలిగిపోతుంది, స్వచ్ఛభారత్, అమృత భారత్,బేటి పడావో, బేటి బచావో నినాదాలు గుటకమైనవనీ తేలిపోయిందని ఆయన విమర్శించారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటు కరుణ కార్పొరేట్కరణ కాషాయీకరణ చేస్తూ బడా పెట్టుబడిదారీబహుళ జాతి కంపెనీలకు మేలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 40 లక్షల కోట్లు ఉన్నదని, మొత్తం బడ్జెట్ అప్పుల కింద జమ చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నదని ఆయన విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని ది వాళ తీయించి కార్పొరేట్ వర్గాలకు అప్పజెప్పటానికి, అదా నీ, అంబానీ, టాటా, బిర్లా లకు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను బలీ పశువులను చేశారని, రైతుల ఆదాయాన్ని పెంచుతామని చెప్పటం బూటకమైనదని ఆయన విమర్శించారు. 800 మంది రైతులు రెండు సంవత్సరాలు ఢిల్లీ నడిబొడ్డులో మిలి టెన్సీ పోరాటం నిర్వహించి భారతదేశానికే ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు. నరేంద్ర మోడీ పాలనలో కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుచేసి స్వయం ప్రతిపత్తికి ద్రోహం చేశారని, ముస్లిం మైనార్టీలను దేశం నుండి వెళ్లగొట్టుటకు పౌరసత్వ చట్టాలు తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఓట్లు రాల్చుకోవటం కోసం పన్నిన కుట్రలో భాగమేనని,అయినా ఫలితం సంతృప్తికరంగా లేదని మోడీ దక్షిణ భారతదేశంలో నాతో మంటలు రాజేయ టానికి ఇండియా కూటమి మావోయిస్టుల భాష మాట్లాడుతుందని,హిందువుల మంగళ సూత్రాలు తీసుకుంటారని, హిందువులను అవమాన పరుస్తారని మాట్లాడటం నీచమైనదని ఆయన విమర్శించారు. భారతదేశంలో 40 కోట్ల మంది కార్మికులు, 80 కోట్ల మంది రైతాంగం బూర్జువ వర్గానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, దోపిడీ వర్గాన్ని ఓడించి,కార్ల్ మార్క్స్,ఎంగేల్స్,లెనిన్, స్టాలిన్,మావో సిద్ధాంత వెలుగులోసోషలిస్టు సమాజాన్ని స్థాపించుకోవడం కోసం త్యాగపూరితమైన యువతరం, ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సీవై పుల్లయ్య క్లాస్ కు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. అలాగే, “విప్లవకమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కార్యకర్తలు ఎలా ఉండాలి” అనే అంశం పైన పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. క్లాస్ కు పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ అధ్యక్షత వహించారు. ఈ క్లాసులలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య,ఆర్ శివలింగం, జి రామయ్య,ఆవుల అశోక్, కే అర్జున్ రావు, బందెల వెంకయ్య కమ్మ కోమటినాగేశ్వరరావు, మలీదు నాగేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, బి లాజర్, సిహెచ్ శిరోమణి, గోకినే పల్లి లలిత,కే శ్రీనివాస్, పార్టీ వైరా మండల కార్యదర్శి ఎలదండి బాబు, కొనిజర్ల మండల కార్యదర్శి తడకమల్ల సీతారాములు,పాశం అప్పారావు, బండారు భద్రయ్య, కుదురుపాక దర్గయ్య,మోదుగు లాలమ్మ, మోదుగు, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS