TEJA NEWS

మా కష్టానికి ఫలితం దక్కింది: హీరోయిన్ ప్రతిభ

మా కష్టానికి ఫలితం దక్కింది: హీరోయిన్ ప్రతిభ
‘లాపతా లేడీస్‌’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నటి ‘ప్రతిభారత్న’ ఆనందం వ్యక్తంచేశారు. ఈ చిత్రంలో ప్రతిభ పుష్పా రాణి పాత్రలో నటించి మెప్పించారు. ‘ఎంతో ఆనందంగా ఉంది. మాటలు రావడం లేదు. మేము ఈ చిత్రం ఆస్కార్‌కు మనదేశం నుంచి ఎంపికవ్వాలని ఎంతో కోరుకున్నాం. మా ఆశలు నిజమయ్యాయి. మా కష్టానికి ఫలితం దక్కింది.’’ అని ప్రతిభ చెప్పారు.


TEJA NEWS