సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవలను మనసులో ఉంచుకోవాలి
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవలను మనసులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. స్థానిక ఫ్రీడం పార్క్ లో చేపట్టిన కార్గిల్ విజయ్ దివస్ లో కలెక్టర్ పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్య్రం ఎలా వచ్చిందో మర్చిపోతున్నామని, ఆనాడు 1877 లో సైన్యంలోని భారతీయులు, మనం బ్రిటిష్ వాళ్ళతో వుండం, మన దేశం తెచుకుంటాం అనే కీలక నిర్ణయం తీసుకోవడంతో మనకు 1947 లో స్వాతంత్య్రం వచ్చిందని, ఆ సమయంలో సైన్యం లేకుంటే స్వాతంత్ర్యానికి ఇంకో 10-15 సంవత్సరాలు పట్టేదని అన్నారు. మనం ప్రశాంతంగా ఉండి, అభివృద్ధి పథంలో వెళుతున్నామంటే, సరిహద్దులో మన హద్దుల్ని కాపాడే సైనికుల వల్లే నని ఆయన తెలిపారు. కుటుంబాలకు దూరంగా, మనకోసం హద్దుల్లో చలికి, ఎండకి లెక్కచేయక కాపలాకాస్తున్న సైనికుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. భారత దేశ సరిహద్దులో 25 సంవత్సరాల క్రితం మన సైన్యం అధికారులు, జవాన్లు ప్రాణాలకు తెగించి పోరాడి, ప్రాణాలు సైతం పోగొట్టుకొని దేశానికి కార్గిల్ యుద్ధ విహాయాన్ని అందించారని, కార్గిల్ విజయ్ దివస్ ఈ జూలై 26తో రజతోత్సవం జరుపుకుంటుందని ఆయన అన్నారు. మాజీ సైనికులు, సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా సైనిక సంక్షేమ అధికారి చంద్రశేఖర్, ఎన్సిసి లెఫ్టినెంట్ కల్నల్ నవీన్ యాదవ్,స్థానిక కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షులు సుబేదార్ మేజర్ మహబూబ్ సుభాని, జనరల్ సెక్రటరీ పి. కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ ఏ. సురేష్ బాబు, వింగ్ కమాండర్ సురేంద్ర, అధికారులు తదితరులు పాల్గొన్నారు.