TEJA NEWS

ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన ఖురేషి పై వాక్యాలు సరికావు.
సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి ఉమా మహేష్.

కాశ్మీర్లోని పహిల్గాం లో ఉగ్రవాదులు జరిపిన దాడులను తిప్పికొడుతూ భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి సోఫియా ఖురేషిని నిన్న బిజెపి మంత్రి అయినటువంటి విజయ్ షా పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క సోదరీ అని ప్రస్తావించడాన్ని దేశద్రోహంగా పరిగణించి వెంటనే అరెస్టు చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.


ప్రాణాలను లెక్కచేయకుండా ప్రభుత్వం ఆదేశించినట్టు పాకిస్థాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ఎంతో ధైర్య సాహసాలతో ధ్వంసం చేసి ఆపరేషన్ సిందూర్ ను విజయవంతం చేసినటువంటి భారత జవాన్ సోఫియా ఖురేషిని మతం పేరుతో కించపరచడాన్ని సిపిఐ గా ఖండిస్తున్నామని, బిజెపికి చెందిన మంత్రి మరియు కొంతమంది నాయకుల వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే జవానులు చేసినటువంటి త్యాగాలను పక్కనపెట్టి దానిని బిజెపి పార్టీకి కీర్తి తెచ్చిపెట్టే విధంగా మాట్లాడుతూ అందులో కూడా మతాన్ని తీసుకురావడం చూస్తుంటే వారికి ఈ దేశ సైన్యం పైన ఎంత ప్రేమ ఉన్నదో తెలియజేస్తుందని దేశ సైనికుల త్యాగాలను కించపరిచే విధంగా మాట్లాడడం సహించరానిదని అన్నారు. ఉగ్రవాద దాడులను,మతపరమైన వ్యాఖ్యలను, సైనికుల త్యాగాలను వాడుకొని బిజెపి చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని గతంలో పుల్వామా దాడిని, పార్లమెంటు పై దాడి చేసిన సమయంలో బిజెపి తమ ఎన్నికల్లో వాడుకున్నట్టు ఇప్పుడు కూడా వాడుకుందామని ప్రయత్నిస్తుందని కానీ దాన్ని ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు.
ఈ దేశ సైనికుల చేసిన పనిని మతం పేరుతో మాట్లాడినటువంటి బిజెపి మంత్రి విజయషా ను మంత్రివర్గం నుంచి తొలగించి దేశద్రోహిగా ప్రకటించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.