జీవ పరిణామ సిద్దాంత రూపకర్త శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సేవలు చిరస్మరణీయం
పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై విద్యార్థులకు అవగాహణ సదస్సు
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి
డోన్ శ్రీ సుధా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యన్. యోగానందరెడ్డి
ఫిబ్రవరి 12 న జీవ పరిణామ సిద్దాంత రూపకర్త శ్రీచార్లెస్ డార్విన్ గారి జయంతి సందర్బంగా
డోన్ పట్టణంలో శ్రీ సుధా జూనియర్ కళాశాల నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ యన్. యోగానందరెడ్డి అధ్యక్షతన శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ గారి జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ నాగేశ్వరరావు, నటరాజ్ ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డోన్ శ్రీ సుధా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యన్. యోగానందరెడ్డి,సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కళాశాల ప్రిన్సిపాల్ యన్. యోగానందరెడ్డి తెలిపారు
చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఫిబ్రవరి 12, 1809 లో జన్మించారు. ఈయన ఇంగ్లాండుకు చెందిన శాస్ర్తవేత్త .ఇతను భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయముపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెంటనే గుర్తుకు వచ్చేది డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం (Darwin’s theory of evolution).ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. డార్విన్ సిధ్ధాంతం ఇప్పటి మైక్రోబయాలజీ, జెనిటిక్స్, మాలిక్యులర్ బయాలజీలను సంఘటిత పరచడంలోనూ, DNA పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తోంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలని, జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి అధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.
విధ్యార్థులు,యువత ఇలాంటి శాస్త్రవేత్తలను అనుసరించి వారి అడుగుజాడల్లో నడుస్తూ అనేక పరిశోధనలు చేసి దేశానికి సేవ చెయ్యాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి, డోన్ శ్రీ సుధా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యన్. యోగానందరెడ్డి కోరారు. అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి విద్యార్థులకు పలు ఆంశాల పై అవగాహణ కలిగించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ – ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు మూఢనమ్మకాలపై నిరంతరం అవగాహనతో ఉండాలి. ఇప్పటికీ అనేక గ్రామాల్లో పట్టణాల్లో వ్యాధులతో బాధపడుతున్నటువంటి పేషెంట్లు స్వామీజీలు మంత్రాలు తంత్రాలు అంటూ తిరుగుతూ వ్యాధి తీవ్రతను ఎక్కువ చేసుకుంటున్నారు. వారిని అవగాహనతో వైద్యశాలకు తరలించే విధంగా చైతన్య పరచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.
స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడకుడదని తెలిపారు.
ఎక్కువగా వాడటం ద్వారా జ్ఞాపకశక్తి తగ్గడం, అసహనం, చిరాకు లాంటి పలు రకాల సమస్యలతో పాటు అది వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. మరణించిన తర్వాత నేత్రదానం, బ్రెయిన్ డెడ్ ,యాక్సిడెంటు అయినటువంటి కేసులలో అవయవాల దానం చెయ్యవచ్చు. ప్రస్తుత సమాజంలో అవయవదానం అవసరం చాలా ఎక్కువ అగుచున్న తరుణంలో ప్రజల్లో విశృత స్థాయిలో అవగాహణ అవసరమని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశం. ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. లింగ నిర్ధారణ నివారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రస్తుత సమాజంలో బాలికల సంఖ్య తగ్గుతున్నది. మహిళా నిష్పత్తి తగ్గటం వల్ల ప్రమాదకర భవిష్యత్‌ను సూచిస్తుందని లింగపరంగా అసమతుల్య స్థితి ఉంటే సమాజంలో అనేక ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. ఆడ మగ ఇద్దరూ సమానమేనని, లింగ వివక్ష చూపడం నేరమేనని తెలియజేశారు. ఆడబిడ్డలను పుట్ట నిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం అలాగే బాల్య వివాహాలు చేయకూడదని తెలియజేశారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులను సంప్రదించకుండా నొప్పులు మాత్రలు వాడరాదు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని,నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.
మీ
పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త డోన్