TEJA NEWS

హైదరాబాద్‌: ప్రగతి సూచికలైన రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌ అండ్‌ బీ శాఖకు రూ.14,305 కోట్లు కేటాయించారు. ఇందులో తొలి 3 నెలలకు రూ.4,768 కోట్ల కేటాయింపులు చేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నదులు, వాగులపై వంతెనలను నిర్మించడం ద్వారా అనుసంధానత కల్పిస్తామని పేర్కొంది. అసంపూర్తిగా ఉన్న కలెక్టరేట్లు, ఎమ్మెల్యేల కార్యాలయాలను పూర్తిచేస్తామని తెలిపింది. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన ప్రాంతీయ రింగ్‌రోడ్డు భూసేకరణకు అవసరమైన నిధులను కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది.


TEJA NEWS