TEJA NEWS

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి

కరీంనగర్ జిల్లా:జనవరి 19
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సూచించారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్ర మంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని,ఆయన అన్నారు.

రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. అక్షింతల్లో రకాలు వుండవని, రేషన్ బియ్యం అని వక్రీకరించడం తగదని హితవుపలికారు.

దైవ కార్యాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ వాళ్లు కోరితే బాసుమతి బియ్యం పంపుతామని బండి సంజయ్ ఈ సందర్భంగా అన్నారు.


TEJA NEWS