TEJA NEWS

వ్యూహం మూవీ గతేడాది డిసెంబర్‌ 29న రిలీజ్‌ కావాల్సింది.

కానీ ఈ చిత్ర సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్‌ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11వరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

దీన్ని సవాలు చేస్తూ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే! తాజాగా వ్యూహం చిత్రంపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా సెన్సార్‌ బోర్డ్‌.. వ్యూహం సెన్సార్‌ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత రికార్డులను కోర్టుకు అందజేసింది.

సెన్సార్‌ బోర్డ్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ వివరాలు పరిశీలించిన అనంతరం మరోసారి విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.


TEJA NEWS