The strike of zoo doctors continues for the second day across the state
రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్నా జూ డా ల సమ్మె
హైదరాబాద్:
రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతున్నది.
వైద్యారోగ్య శాఖమంత్రితో చర్చలు అసంపూర్ణంగా ముగియ డంతోపాటు డీఎంఈతో చర్చలు విఫలమవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతున్నది.
తమ డిమాండ్లను పరిష్క రించే వరకు సమ్మెను విర మించేది లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. ఎమర్జన్సీ సేవలు మినహా ఓపీ, ఐపీ సేవలకు దూరంగా ఉంటున్నారు.
దీంతో ప్రభుత్వ దవాఖాన ల్లో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు గాంధీ, ఉస్మానియా, కాకతీయతో పాటు రాష్ట్రంలోని సర్కారు మెడికల్ కాలేజీల ముందు భైఠాయించి నిరసన తెలిపారు.
తమ న్యాయమైన సమస్య లను పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు. సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో మి నిస్టర్స్ క్వార్టర్స్‌లో చర్చలు జరిపారు.
జూడా లు తమ ఎనిమిది డిమాండ్లను మంత్రి ముం దుంచారు. చర్చల అనంత రం జూడా అధ్యక్షుడు డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ.. మంత్రి కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందిం చారని చెప్పారు. స్టైపెండ్ చెల్లింపునకు గ్రీన్‌చానల్‌పై మరోమారు చర్చించి, నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు..