TEJA NEWS

ప్రతి తెలంగాణ బిడ్డ పోరాటం, ఉద్యమకారుల పోరాటం కెసిఆర్ ఉద్యమంతో పాటుగా అమరణ నిరాహార దీక్ష చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు . కార్పొరేటర్ శిరీష బాబురావు , రాగిడి లక్ష్మమ రెడ్డి తో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1969 నుండి తెలంగాణ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిందని శ్రీకాంత్ చారి, యాదగిరి రెడ్డి, లాంటి ఎందరో అమరవీరుల త్యాగాలు, కెసిఆర్ అమరణ నిరాహార దీక్ష, ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ అంటే బతుకమ్మ అలాంటి బతుకమ్మను తీసివేసి అమ్మ వారి కిరటాన్ని తీసివేసి బతకమలేని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ చేసిన అభివృద్ధి పనులకు పేర్లు మార్చడమే తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలలో అభివృద్ధిలో గుండు సున్న పెట్టారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ తల్లిని వాళ్ల గాంధీభవన్ కి పంపించి మళ్లీ బతకమ్మ ఉండే మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.


TEJA NEWS