TEJA NEWS

గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించాలి.
విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు
బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి
బోనకల్లు పోలీస్ స్టేషన్ అకస్మీకంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

మాధకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి క్షేత్రస్దాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. బోనకల్లు పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా సందర్శించి పోలీస్ స్టేషన్ రికార్డులు తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరును పరిశీలించారు సెక్టార్ పోలీస్ అధికారులతో మాట్లాడారు. నేరప్రవర్తన కలిగిన హిస్టరీ షీట్, రౌడీ షీట్లను తనిఖీ చేశారు. ఆనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాదిత
ఫిర్యాదుదారులతో మాట్లాడారు. వారి సమస్యలను నేరుగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని ఎస్సైను ఆదేశించారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాలని, సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా నియంత్రించేందుకు రాత్రి గస్తీ, పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలలో ర్యాలీలు, సదస్సులు నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా కట్టుదిట్టమైన నిఘాతో అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకొవాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ తరహా నేరాలు ఎక్కువ నమోదవుతున్నాయో వాటి నియంత్రణకై దృష్టి పెట్టాలన్నారు. కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు. అదేవిధంగా ప్రతి కేసులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, తద్వారా బాధితులకు సరియైన న్యాయం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలన్నారు.

గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించాలి
Print Friendly, PDF & Email

TEJA NEWS