TEJA NEWS

కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు

అంతర్జాతీయ “కార్మికుల దినోత్సవం” మే డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించిన మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు

అంతర్జాతీయ “కార్మికుల దినోత్సవం” మే డే సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ అమరవీరుల స్తూపం వద్ద TRSKV సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు మరియు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ఎన్ ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు అని, అన్ని రంగాల్లో కార్మికులు ఎనలేని సేవలను అందిస్తున్నారని,కార్మిక సోదర సోదరీమణులకు అందరికీ వందనాలు తెలుపుతూ,
మరోమారు కార్మిక సోదరులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పాక్స్ చైర్మన్,కార్పొరేటర్లు ,కో-ఆప్షన్ సభ్యలు, సీనియర్ నాయకులు, నాయకులు, మహిళా నాయకులు, ఉద్యమకారులు,TRSKV నాయకులు ,కార్మిక సోదర సోదరీమణులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS