TEJA NEWS

భౌరంపేట్ లోని రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన గ్రామ నాయకులు, పెద్దలు….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో నిన్నటి నుండి మొదయిలైన నూతన రోడ్డు విస్తరణ పనులను భౌరంపేట్ PACS చైర్మన్ , కౌన్సిలర్లు, మరియు నాయకులు మున్సిపల్ AE సురేందర్ నాయక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంత కాలంగా మిషన్ భగీరథ పనుల కారణంగా రోడ్డు పూర్తిగా పాడవ్వడం వలన నూతన రోడ్డును వేస్తున్నామని అన్నారు. ఈ రోడ్డు విస్తరణ వల్ల భవిష్యత్ లో గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు.

గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు ప్రతీ ఒక్కరు కూడా రోడ్డు విస్తరణ పనులకు వారి యొక్క సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , డైరెక్టర్లు సత్తిరెడ్డి , భీం రెడ్డి , మహిపాల్ రెడ్డి , నాయకులు మురళీ యాదవ్ , విష్ణువర్ధన్ రెడ్డి , ధర్మారెడ్డి , ఆకుల యాదయ్య , కృష్ణా రెడ్డి మరియు గ్రామ నాయకులు, పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS