యాదవుల ఐక్యత ను చాటడం కోసం జరిగేయాదవ సమారాధన కార్యక్రమం జయప్రదం చేయండి
-ప్రచార జాత కార్యక్రమంలో మేకల మల్లిబాబు యాదవ్, చిత్తారు సింహాద్రి యాదవ్, వెన్నపూసల సీతారాములు
ఈనెల 24 న యాదవ బంధుమిత్రుల వన సమారాధన కార్యక్రమం చెరుకూరి మామిడి తోట ఖమ్మంలో జరుగుతుందని, యాదవుల ఐక్యతను నిరూపించుకోవడం కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి యాదవ కుటుంబం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, యాదవ యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు యాదవ్ లు పిలుపునిచ్చారు.
యాదవ బంధు మిత్రల ప్రచార జాత కార్యక్రమం కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో యాదవులు భారీ ఎత్తున పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన మన హక్కులు సాధించుకోవాలంటే వర్గాలకతీతంగ, ఐక్యం కావలసిన అవసరం ఉన్నదని, పేద,ఉన్నత అనే తేడా లేకుండా సహపంక్తి భోజనం చేసి, మన నాయకుల ప్రసంగాలతో చైతన్యం కావలసిన అవసరం ఉండటం వలన , ఒకప్పుడు చట్టసభలలో మేజర్ గా ఉన్న మనం ఈరోజు మైనారిటీ లో కూడా లేకపోవడం మన దురదృష్టమని వ్యాఖ్యానించారు. ప్రతి యాదవ కుటుంబం విధిగా పాల్గొనాల్సిందిగా వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లె బోయిన శ్రీనివాస్, పొదిల సతీష్, మెండే వెంకటేష్, సోమనబోయిన లింగయ్య, మొరిమేకల నాగేశ్వరరావు, బాలిని శ్రీశైలం పల్లెబోయిన శ్రీనివాసరావు బుర్ర మమత, భారీ సురేష్ కాంసాని గురవయ్య వట్టే నాగేశ్వరరావు వాగదాని కన్నయ్య, బట్టు మల్లయ్య మన్నే కోటేశ్వరరావు, మన్నే శ్రీను, గొలుసు రవి కూరాకుల నాగేశ్వరరావు, చిలకల లింగయ్య, పూజల బుచ్చయ్య చిన్నబోయిన వీరబాబు మరియు తదితరులు పాల్గొన్నారు