TEJA NEWS

ప్రజల అర్జీలు పై అలసత్వం వద్దు, జవాబుదారిగా ఉండాలి

భూ సమస్యలు పై శ్రద్ద పెట్టి, బాధితులకు న్యాయం చేయండి

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

శింగనమల నియోజకవర్గం:యల్లనూరు మండల కేంద్రం లో ఎంపీడీఓ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక-ప్రజా దర్బార్ “
కార్యక్రమాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ నిర్వహించి నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

రోడ్లు,విధి దీపాలు,పింఛన్లు,తాగునీరు,విద్యుత్ తదితర అంశాలపై ప్రజల నుంచి స్వీకరించారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం భూముల గురించి చేసిన రీ-సర్వేలో అవకతవకలు జరిగాయని,న్యాయం చేయాలని అర్జీలు రావడం కొస మెరుపు.ప్రజలు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ల పై ఎక్కడ నిర్లక్ష్య వైఖరి లేకుండా, ప్రతి ఒక్క వినతిపత్రం పై జవాబుదారీతనం ఉండటం తప్పనిసరి అని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు.

ముఖ్యంగా అర్హులైన పేదలకు బియ్యం కార్డులు అందించడంలో కృషి చేయాలని కోరారు.ప్రతి సంక్షేమ పథకానికి బియ్యం కార్డు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని అన్నారు.మండలంలో ప్రజలు ఇచ్చిన అర్జీలు పై సకాలంలో స్పందించి, వేగంగా పరిష్కరించాలని పేర్కొన్నారు.

అలాగే భూ సమస్యలు పై నిర్ణిత కాలంలో పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ఆదేశించారు.


TEJA NEWS