గద్వాల జిల్లా:మార్చి07
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు కోచింగ్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని జోగులాంబ గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు టి. ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వ ర్యంలో బీసీ స్టడీ సర్కిల్‌లో టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు డిగ్రీ అర్హత కలిగిన జోగులాంబ గద్వాలల్, వనపర్తి జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు తేదీ 07. 03. 2024 సా. 5 గంటలలోగా మొదటి రైల్వే గేట్ దగ్గర గల బీసీ స్టడీ సర్కిల్, జోగులాంబ గద్వాల్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్య ర్థుల కుటుంబ వార్షిక ఆదా యం రూ. 5 లక్షలకు మించరాదని, దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క ఎస్‌ఎస్‌సీ ఇంటర్, డిగ్రీ, క్యాస్ట్, లేటెస్ట్ ఆదాయం, ఆధార్ కార్డు, 2 ఫోటోలు తీసుకొని నేరుగా బీపీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకోవలన్నారు.
అభ్యర్థుల ఎంపిక విధానం రిజర్వేషన్, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం స్టడీ మెటీరియల్ అందిస్తామని, మరిన్ని వివరాల కోసం ఫోన్ నెం: 08546-293022, 99085 60268 నెంబర్‌లకు సంప్రదిం చాలనన్నారు.
లేదా టీటీయన్ బిల్డింగ్, పాత ఎల్‌ఐసీ ఆఫీసు, మొదటి రైల్వే గేట్ దగ్గర, గద్వాల్ టౌన్, జోగులాంబ గద్వాల్ ఆఫీసు వేళలలో సంప్రదించాలన్నారు…