హైదరాబాద్:మార్చి 07
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డిఎస్పీ లను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టారు.
ఇటీవల ఐపీఎస్ అధికా రుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం గత వారం రోజుల్లో మూడుసార్లు డీఎస్పీ లను బదిలీ చేశారు..