
పారదర్శక పాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్
పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 53 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి సుమారు 42,41,628 లక్షల నిధులు మంజూరయ్యాయి.
ఇందుకు సంబంధించిన చెక్కులను భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో గురువారం కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కూటమి నాయకులతో కలిసి అడ్డూరి శ్రీరామ్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పేదల జీవితాలతో చెలగాటం ఆడారన్నారు.
కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు ప్రైవేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించుకుంటున్న నిరుపేదలకు ఈ సీఎంఆర్ఎఫ్ ఎంతో ఊరట కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరయ్యే ఆర్థిక సాయం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు.
అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలనను అందిస్తూ
ఆన్ లైన్ లోనే దరఖాస్తులు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుసుకునేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.
ఇప్పటివరకు పశ్చిమ నియోజకవర్గంలో 109 మంది లబ్ధిదారులకు రికార్డు స్థాయిలో సుమారుగా 1 కోటి రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు.
పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
చెక్కులు అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎన్డీఏ కూటమినేతలు యేదుపాటి రామయ్య, శివాజీ ముదిరాజ్, గుర్రంకొండ, ధీటి ప్రభుదాస్, కొప్పుల గంగాధర్, సోంపాక చినబాబు, ప్రదీప్ రాజ్, కొమరకిరణ్, మామిడి భాస్కర్, నెలకుర్తి వెంకటరావు, షేక్ సుభాని, పీవీ చిన్న సుబ్బయ్య, వై విశ్వేశ్వరరావు, దేవిన హరిప్రసాద్, బొల్లేపల్లి కోటేశ్వరరావు, రుద్రపాటి వెంకటేష్, దేవిన హరిప్రసాద్, కొనికి కొండయ్య, పల్లె పోగు ప్రసాద్, నున్న కృష్ణ, దొడ్ల రాజా, హనుమంతు, పిట్టల సాంబశివరావు, దొనపాటి కృష్ణారెడ్డి, పితాని పద్మ, ఒమ్మి అన్నపూర్ణ, రౌతు రమ్యప్రియ, తదితరులు పాల్గొన్నారు.
