TEJA NEWS

పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఏసీపీ భోజరాజు, ఎస్. ఐ లు సాధిక్ అలీ, రవీందర్, మధు, బాబు, లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ అంబర్ కిషోర్ ఝా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మీ సేవలను నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయని పదవీ విరమణ తర్వాత కూడా మీ గౌరవం తగ్గదని, ఆరోగ్యం శ్రద్ద వహించాలని నిత్యం వ్యాయామం కొరకు కొద్ది సమయాన్ని కేటాయించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సురేష్ కుమార్, ఏసీపీ లు నాగయ్య, సురేంద్ర, సత్య నారాయణ, ఆర్.ఐ లు సతీష్, శ్రీనివాస్, స్పర్జన్ రాజ్, ఆర్. ఎస్. ఐ శ్రవణ్ తో పాటు పదవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.