జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏ
హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన-రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి*
అనంతరం నియోజకవర్గం నూతన కమిటీ ఏర్పాటు*
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లో కొనసాగుతున్న 27 వేల మంది జర్నలిస్టుల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారం కోసం
నిత్యం పోరాటం చేసేది తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ టీఎస్ జెఏ అని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో టౌన్ హాలులో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కలిసి 12 డిమాండ్లతో పొందుపరిచిన వినతి పత్రాన్ని అందించి హైదరాబాదులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిపారు.
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడ నున్నట్లు యాదగిరి పేర్కొన్నారు. జర్నలిస్టులు అందరూ యూనియన్లకు అసోసియేషన్లకు అతీతంగా ఐక్యమత్యంతో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కలిసి ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో అసోసియేషన్ సీనియర్ జర్నలిస్టులకు కార్డులను అందించారు.అనంతరం నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా అల్వాల రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పిడమర్తి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాతంగి రవి,కోశాధికారిగా మాలోతు శంకర్, గౌరవ అధ్యక్షులుగా చిలక సైదులు, గౌరవ సలహాదారులుగా బరిగెల వీరయ్య,హుజూర్నగర్ నియోజకవర్గ మహిళా కమిటీ అధ్యక్షురాలిగా మెండెం రమణ లను నియమించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులను హుజూర్నగర్ నియోజకవర్గం కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.అనంతరం నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కమిటీకి రాష్ట్ర కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి నాగబాబు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలుకల చిరంజీవి రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్
రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్లు భీమవరం రామకృష్ణారెడ్డి బరిగెల విజయ్ కుమార్ త్రిపురం లక్ష్మారెడ్డి నూతనంగా సభ్యత్వం తీసుకున్న సభ్యులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.tejanews.app
Teja news
Download App