TEJA NEWS

పాషా పబ్లిక్ పాఠశాలలో షేర్ అంబ్రెల్ల సంస్థ   ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అనే అంశం మీద అవగాహన కార్యక్రమము నర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మల్కాజిగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్ నేరెడ్మేట్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
షేర్ అంబ్రేల్ల సంస్థ ఫౌండర్ విజయ అర్చన పాఠశాల ప్రిన్సిపాల్ నిరీక్షణ్ పాల్గొన్నారు.

ఈ కార్య్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మల్కాజ్గిరి అదనపు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ
విద్యార్థులకు పర్యావరణం యొక్క ప్రాముఖ్యత ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్డు సేఫ్టీ మీద అవగాహన కల్పించారు.
విద్యార్థులు తమ తల్లితండ్రులకు కూడా వివరించాలని కోరారు

అంతే కాకుండా డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్ లేదా ఆన్లైన్ లో జరిగే మోసాలను పట్ల అప్రమతంగా ఉండాలని సూచించారు.

ఎస్ ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క ని నాటి దానిని పుస్తకాల వలె జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.
విజయ అర్చన మాట్లాడుతూ తమ సంస్థ యొక్క ఉద్దేశం ఒక లక్ష మొక్కలు నాటి పర్యావరణం కాపాడటం అని తెలియజేసి ప్రతి విద్యార్థి కూడా మొక్కలు మరియు వాతావరణం యొక్క ప్రాముఖ్యత ను అందరికీ తెలియజేసి మంచి సమాజం కొరకు పాటుపడాలని తెలియజేశారు.
పాఠశాల ప్రిన్సిపాల్ నిరీక్షణ్ మాట్లాడుతూ నేర్చుకున్న విషయాలను తల్లితండ్రులకు తెలియజేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
కార్యక్రమం అనంతరం పాఠశాల ఆవరణంలో అధికారులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు

ఈ కార్యక్రమంలో పాఠశాల డ్యాన్స్ మాస్టర్ నరసింగరావు, సందీప్, సుష్మా, తదితరులు పాల్గొన్నారు

TEJA NEWS