Spread the love

భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీలు రాకుండా చూడాలి.

సకాలంలో పన్నులు వసూలు చేయండి.

కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలో ఎక్కడా భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీలు రాకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని 35 వ వార్డులో డిప్యూటీ మేయర్ ఆర్.సి.ముని కృష్ణ, హెల్త్, ఇంజినీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలసి పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు, అనంతరం కార్యాలయంలో అధికారులతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో భూగర్భ డ్రైనేజీ కాలువల లేకేజీల పై పిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని అన్నారు.

వీటిని అరికట్టేందుకు తగు ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా శుభ్రం చేయాలని అన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా అస్థిపన్నులు, నీటి పన్నులు తదితర పన్నులను అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి సకాలంలో వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డిసిపి మహాపాత్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, మేనేజర్ హాసిమ్, డి.ఈ.లు, ఏసిపి లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.