నిరుద్యోగులు,యువత స్వయం ఉపాధి రంగాలలో ఆర్థికంగా ఎదగాలి.
నూతన ఆటో మొబైల్స్ & మెకానిక్ షాప్ ను రిబ్బన్ కట్టింగ్ చేసి ప్రారంభించిన..
- గంజిపేట రాజు
BRS పార్టీ జిల్లా యువ నాయకులు,గద్వాల
● జోగులంభ గద్వాల జిల్లా,థరూర్ మండల కేంద్రంలోని MRO కార్యాలయం దగ్గర షాప్ యజమాని జి.శేఖర్ నూతనంగా ఏర్పాటు చేసిన “ఆటో మొబైల్స్ మరియు బైక్ మెకానిక్ షాప్ ను ‘ప్రారంభించిన గంజిపేట రాజు ‘
షాప్ యజమాని శేఖర్ థరూర్ S I సుకురూ కీ గంజిపేట రాజు కీ శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ‘BRS పార్టీ జిల్లా యువ నాయకులు గంజిపేట రాజు షాప్ యజమాని శేఖర్ కీ ఆర్థిక శుభాకాంక్షలు తెలోయజేస్తూ’..
నేటి ఆధునికయుగంలో యువత ప్రభుత్వ ఉద్యోగాల కొరకు వేచి చూడకుండా అందుబాటులో ఉన్న స్వయం ఉపాధి రంగాల వైపు యువత ఆసక్తి కనబర్చడం హర్షణీయమన్నారు.పట్టుదల,కృషితో ఆలోచనలను ఆచరణలో పెట్టెవారు సాదించలేనిది ఏది లేదన్నారు.
గద్వాల నియోజకవర్గంలో యువత అన్ని రంగాలలో రాణించాలి యువత స్వయం ఉపాధితో ఎదగాలి వివిధ రంగాలలో యువత వ్యాపారలను చేయాలి అప్పుడే గద్వాల నియోజకవర్గం అన్ని రంగాలలో అన్ని పరిశ్రమలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ప్రారంభోత్సవానికి హాజరైన వారిలో,రఘునాథ్ రెడ్డి,రంజిత్,అకేపోగు రాజు,డ్యాం రాజు,శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, గోపన్నా,ఏసురత్నం,సూరన్నా,సుధాకర్,జయన్న,కుమార్, తదితరులు హాజరయ్యారు