TEJA NEWS

వనపర్తి నియోజకవర్గంలో
అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి_
రూ .3కోట్ల 50లక్షలు మంజూరు
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడి

వనపర్తి

  • విద్యాపర్తిగా పేరెన్నికగన్న వనపర్తి నియోజకవర్గం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది_

ఇప్పటికే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణానికి నేడు టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది.

_ *జిల్లా కేంద్రంలో నూతనంగా “అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల” నిర్మాణానికి ప్రభుత్వం రూ. 3.50 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసిందని ఎమ్మెల్యే మెగా రెడ్డి తెలిపారు_

వనపర్తి నడిబొడ్డున ఉన్న బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు అధునాతన హంగులతో నూతన భవన నిర్మాణాలు చేపట్టిందని

వసతిగృహాలలో (hostel) ఉండి విద్యనభ్యసించే విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలను పెంచి వారి ఇబ్బందులను తొలగించి విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తోంది

నూతన మండలాలలో నూతనంగా KGBV పాఠశాలలను ఏర్పాటు చేసి బాలిక విద్యాభివృద్ధికి బాసటగా నిలిచింది

పాఠశాల ప్రారంభానికి ముందే అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేసి సర్వం సిద్ధంగా ఉంచింది

పదేళ్ల పాలనలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థ నేడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు అని అన్నారు