రైతులుకు నవధాన్యాలు మరియు పచ్చిరొట్ట ఎరువుల వాడకం

రైతులుకు నవధాన్యాలు మరియు పచ్చిరొట్ట ఎరువుల వాడకం

TEJA NEWS

కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలొ డబ్ల్యూ. డబ్ల్యూ. ఎఫ్ – నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ వారి ఆధ్వర్యంలో గ్రామ రైతులతో కలిసి క్షేత్ర ప్రదర్శన చేసి, సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త కంచం అనిల్ మాట్లాడుతూ వేసవిలో పెసర, బబ్బేర, మినుములు, మొక్కజొన్న, గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, శనగలు, పిల్లి పెసర పెసర, జీలుగు మొదలైన నవధాన్య మరియు పచ్చి రొట్టఎరువులు దుక్కిలో చల్లుకొని రెండు,మూడు నీటి తడులు ఇచ్చి 45 రోజుల వయసులో పూత దశలో వాటిని భూమిలో కలియదన్నాలి. దీనివల్ల భూమిలో సూక్ష్మ పోషకాల లోపం తగ్గి రైతులు ఏ పంటలు వేసుకున్న వాటిలొ పోషక లోపాలు లేకుండా ఉంటాయి. పప్పు జాతి పంటల వేర్లలోని బోడిపెలు వల్ల నత్రజని స్థిరీకరణ జరుగును. దీనివల్ల రైతులు నత్రజని వాడకం తగ్గి పెట్టుబడి కూడా తగ్గించుకోవచ్చును. నవధాన్య లేదా పచ్చి రొట్ట ఎరువులను భూమిలో కలియ దున్నడం వల్ల భూసారం పెరిగి, సూక్ష్మజీవులు అభివృద్ధి జరిగి, తేమ కలిగి ఉండును. అలాగే ఏ పంట వేసుకున్న అధిక దిగుబడులు వస్తాయని, దీనివల్ల రైతులు ఎరువులను తగ్గించుకోవచ్చును. అధిక పురుగు మందులు వాడడం వలన రైతులకు పెట్టుబడి పెరిగి పర్యావరణ కలుషితం కూడా ఎక్కువ అవుతుంది. అలాగే పంటకాలం అయిన తర్వాత పత్తిని తీసేసి పంట మార్పిడి చేసుకోవాలి .ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవాలనీ తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో క్షేత్ర సిబ్బంది కంచం అనిల్,వంగ రఘు, రాజేందర్ ,శ్రీనివాస్, మోహన్, లత, మౌనిక, సౌజన్య మరియు పంగిడిపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి