వైద్యో నారాయణో హరిః. వైద్యుడు దేవునితో సమానం అని భావించే మన దేశంలో కరోనా లాంటి మహమ్మారి నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడినటువంటి ఉన్నతమైన స్థానం లో ఉన్న వైద్య రంగం లో ఉన్న వాళ్ళ పై దేశం లో పలు చోట్ల జరుగుతున్న అమానుషమైన ఘటనలు ఈ సమాజాన్ని కలచి వేస్తున్నాయి.
“నర్సింగ్ ఇస్ ఎ నోబెల్ ప్రొఫెషన్” అలాంటి నర్సు వృతి లో ఉన్న ఒక నర్సింగ్ ఆఫీసర్ పై ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం మరియు హత్య , షాద్ నగర్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో విధులలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ పై జరిగిన దాడి, మరియు కొల్ కత్తా మెడికల్ కళాశాల ఆసుపత్రి లో పీజీ వైద్యురాలిపై పాశవికంగా జరిగిన అత్యాచారం మరియు హత్య ఈ సమాజాన్ని తల దించుకునేల చేశాయి. “ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు” అనే పరిస్థితుల నుంచి ఈ రోజున అన్నీ రంగాలలో ఉన్నత స్థానాలలో తమదైన ముద్ర వేస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణం లో ఆడపిల్లలను గొడుగులా కాపాడాల్సిన ఈ సమాజమే పాముల్లా కాటు వేస్తుంటే ఇక ఆడపిల్లలకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది.
సమాజానికి ఎంతో సేవ చేయాలని, తాము ఎంచుకున్న రంగం లో ఉన్నతం గా ఏదయినా సాధించాలని ఆరాటపడి అహర్నిశలు శ్రమిస్తున్న వాళ్లపై ఇంత
కర్కశంగా దాడి చేసి వారి ఆశలను ఆశయాలను మధ్యలోనే ఛిద్రం చేస్తున్న ఈ కిరాతకులకు ఖచ్చితం గా కఠిన శిక్ష పడాలి. దీనికి నిరసనగా ఈ రోజు ఉదయం 9.30 నిమిషాలకు రాందేవ్ రావ్ హాస్పిటల్ యాజమాన్యం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని Dr. ఛాయా దేవి ( అబస్ట్రిక్ అండ్ గైనిక్ HOD), Dr. శ్యామల ( జనరల్ ఫీజీసియన్) హాస్పటల్ మెడికల్ డైరెక్టర్ Dr. కమలాకర్ , హాస్పిటల్ CEO Dr. యోబు ,క్యాండిల్స్ వెలిగించి సంతాపం తెలిపి ర్యాలీ ప్రారంభించారు. Kphb రోడ్డు no.1 లోని గాంధీ విగ్రహం వరకు అందరూ కలిసి ర్యాలీ గా వెళ్ళటం జరిగింది.తదనంతరం Dr. శ్యామల మాట్లాడుతూ “యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” అని ఆడవాళ్ళని దేవతల్లా పూజించే ఈ దేశంలో ఈ రోజున ఇలాంటి అసాంఘిక ఘటనలు జరగటం అనేది చాలా విషాదకరం అని పేర్కొన్నారు. రోగులకు సేవ చేస్తున్న ఒక డాక్టర్ నీ ఈ విధంగా అత్యాచారం చేసి చంపటం అనేది ప్రతి భారతీయుడిని కలిచివేస్తున్న విషయం అని ఆమె పేర్కొన్నారు.
అనంతరం Dr. శ్రీనివాసులు( జనరల్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్) గారు మాట్లాడుతూ ఉమెన్ ఎంప్లాయీస్ కి సేఫ్టీ అనేది చాలా ముఖ్యం అని, ఆడవాళ్ళు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని ఆ రోజు గాంధీ గారు అన్న మాటలు ఈ 78 సం ల స్వాతంత్ర్య భారత దేశంలో ఇప్పటికీ అవలంభించలేకపోతున్నం అని , ఎన్ని కఠినమైన “దిశ” చట్టాలు వచ్చినా ఈ రోజుకి ఆడపిల్లలను ఇంత కిరాతకం గా హింసించి అత్యాచారాలు చేసి హత్యలు చేస్తుంటే ఆకాశాన్ని తాకుతున్న “ఆ ప్రతి భారత మాత” ఆక్రందన తీర్చేదెవరు అని వాపోయారు. తదనంతరం Dr. ఛాయా దేవి మాట్లాడుతూ నిందితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవటానికి వీలు లేదని, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని, నిందితుడికి శిక్ష పడేవరకు మా పోరాటం ఆగదు అని పేర్కొన్నారు. అనంతరం హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ Dr. కమలాకర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి అని, అన్నీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ విధానాన్ని మరింత బలోపేతం చసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తదనంతరం హాస్పిటల్ CEO Dr. యోబు మాట్లాడుతూ డ్యూటీ లో ఉన్న ఒక డాక్టరు పై కానీ నర్స్ పై కానీ ఇలాంటి అసాంఘిక ఘటనలు పునరవృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఇలాంటి సంఘటనలు జరగటం వలన ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఆడపిల్లలను ఇంట్లో నుంచి బయటకు పంపాలి అంటేనే వారి తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వస్తుందని, ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండాలంటే దోషి కి శిక్ష పడాలి అని పేర్కొన్నారు. అలాగే విక్రమ్ దేవ్ రావ్ , అపర్ణ రావ్ , మీరా రావ్ , ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటనను తీవ్రం గా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. నర్సింగ్ సూపరిండెంట్ మేరి డేవిడ్ కూడా ఈ ఘటనపై చాలా తీవ్రం గా స్పందించారు. నర్సెస్ కి డాక్టర్స్ కే భద్రత లేకుండా పోతే ఇంకా ఈ సమాజం లో మామూలు స్త్రీలకు భద్రత ఎవరు కల్పిస్తారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ డాక్టర్స్ Dr. శ్యామల ,Dr. శ్రీనివాసులు ,Dr. సుధా రాణి , Dr. రాజీవ్ , Dr. లోకేష్ రెడ్డి,Dr. ఐశ్వర్య, Dr. రాధ దొండపటి,Dr. మంజుల,Dr. స్వాతి రెడ్డి, Dr. శ్రీవిద్య, Dr. ఆదిత్య,Dr. పావని,Dr. కిన్నెర ,అలాగే డ్యూటీ డాక్టర్స్, నర్సెస్ అడ్మిన్ మేనేజర్లు కల్పనా,రమ, శ్రవణ్…
వైద్యో నారాయణో హరిః. వైద్యుడు దేవునితో సమానం
Related Posts
ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన
TEJA NEWS ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన వనపర్తి రాష్ట్రంలోరూ. 7800 కోట్లకు పైగా ఉన్న విద్యార్థ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలనువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం అంబేద్కర్…
జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం…
TEJA NEWS •జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం… సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్.. కోదాడ సూర్యాపేట జిల్లాఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సూర్యాపేట జిల్లా…