TEJA NEWS

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

కాంగ్రెస్ గెలుపు కోసం కేశంపేట్ మండలంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమం

ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి

★ కేశంపేట్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా ఎన్నికల ప్రచారం. ఈ సందర్భంగా కేశంపేట్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొనీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేశంపేట్ వచ్చిన ఆయనకు ప్రజలు నీరాజనం పలికారు. హస్తం మన నేస్తం అంటూ 10 ఏండ్లు పరిపాలించిన బీజేపీ, బిఅరెస్ చేసింది ఏమి లేదు దోపిడీ తప్ప, ప్రజలకు మాయమాటలు చెప్పి పబ్బం గడిపరన్నారు, మళ్ళీ వాళ్ళ మాయమాటలను నమ్మి మోసపోవద్దన్నారు, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాండ్ర కాశినాథ్ రెడ్డి, జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, ఎంపీపీ ఇద్రిస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విరేశం మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS