TEJA NEWS

వనపర్తి ప్రజావాణిలోప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంది -…….. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి

…..

సాక్షిత వనపర్తి :
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్, వారి యంత్రాంగం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి ప్రశంసించారు.
ఎన్నికల కోడ్ ముగిసినందున సోమవారం ఉదయం ఐ.డి ఒ. సి ప్రజావాణి హాల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం చేపట్టారు.
ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి అకస్మాత్తుగా హాజరై పరిశీలించారు.
ప్రతి మంగళవారం, శుక్రవారం హైదారాబాద్ లోని ప్రజాభవన్ లో జరిగే రాష్ట్ర ప్రజావాణి విభాగానికి ఇన్చార్జి అయిన ఆయన జిల్లాలో ప్రజావాణి ఏ విధంగా జరుగుతుంది స్వయంగా పరిశీలించి కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. చాలా సేపటి వరకు కూర్చొని ప్రజల ఫిర్యాదులు ఎలా తీసుకుంటున్నారు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను గమనించారు.
వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్, అదనపు కలెక్టర్ పరిశీలించి అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, వెబ్ కాన్ఫరెన్స్ లో ఉన్న మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కంప్యూటర్ లో ఆన్లైన్ చేయడం చూసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తన సంతృప్తిని వ్యక్తం చేశారు.
హైదారాబాద్ లో సైతం రేపటి నుండి ఈ పద్ధతిని అనుసరిస్తామని చెప్పారు. తక్షణం పరిష్కరించాల్సిన ఫిర్యాదులను నేరుగా తనకు పంపేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజల సమస్యకు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అదే విధంగా విద్యా, వైద్యం, వ్యవసాయం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలియజేశారు.
పాఠశాలల పునఃప్రారంభం ఘనంగా చేపట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మామిడి ఆకు తోరణాలు, కొబ్బరి మట్టలు కట్టి పండగ వాతావరణం కల్పించాలని సూచించారు. ఇప్పటికే పాఠశాలలకు అవసరమైన మౌళిక సదుపాయాలు పూర్తి చేయడం జరిగిందని, వాటిని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించడం పై రాష్ట్రస్థాయిలో ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి కావలసిన విత్తనాలు, ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
ఇరిగేషన్ శాఖ అధికారులు తన క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా కాలువల పరిశీలన చేయించాలని, ఎక్కడైనా పూడికతీత లేదా మరమ్మతు లాంటివి అవసరం అయితే వాటిని త్వరగా చేయించాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని. తెలియజేశారు.
పాఠశాలల పునఃప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . ఇప్పటికే అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు పూర్తి అయ్యాయని, పిల్లలకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అన్ని సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు.
జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఉన్నాయని, నకిలీ విత్తనాలను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేస్తున్నట్లు వివరించారు.
అంతకుముందు అనంతరం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులను సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.


TEJA NEWS