Spread the love

మృతుల కుటుంబాలకు పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….

వరంగల్ జిల్లా…
వరంగల్ జిల్లా వర్ధన్నపేట టౌన్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు భవానికుంట తండా లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త నూనావత్ దీప్ల నాయక్ అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకొని మరణించగా వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …

అనంతరం వర్ధన్నపేట టౌన్ పరిధి లోని 3వ వార్డు కి చెందిన ల్యాదల్ల రాజమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మరణించగా వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు…

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట టౌన్, మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ టౌన్, మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు……