TEJA NEWS

ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు

హైదరాబాద్ మల్కాజ్గిరి కేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి లోని గౌతమ్ నగర్ డివిజన్ జ్యోతి నగర్ దోబిగాట్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. వీరనారి ఐలమ్మ 129వ జయంతిని ఘనంగా నిర్వహించామని అన్నారు. నేడు చాకలి ఐలమ్మ జయంతిని జరగకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డాయని అయినా ముందుకు వెళ్లి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సంయుక్త కార్యదర్శి కాసర్ల నాగరాజు, కాలనీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..


TEJA NEWS